గూడూరులో ఘనంగా తీజ్ వేడుకలు

MHBD: గూడూరు మండల కేంద్రంలో గురువారం తీజ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్, పలువురు బంజారా నాయకులు పాల్గొన్నారు. మహిళలు, యువతులు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇవన్నీ బంజారా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించాయి.