నేడు పెనుకొండలో మంత్రి సవిత పర్యటన
సత్యసాయి: పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 8 గంటలకు అయ్యప్ప స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన, 9 గంటలకు మాజీ మంత్రి ఎస్. రామచంద్రారెడ్డి వర్ధంతి ఘాట్ వద్ద నివాళులు, సాయంత్రం 6 గంటలకు డ్రామా కార్యక్రమంలో పాల్గొంటారు. నాయకులు, మీడియా ప్రతినిధులు హాజరుకావాలని కోరారు.