ఫస్ట్ ఇయర్‌లో ఆదిలాబాద్ అమ్మాయిల ముందంజ
ఆదిలాబాద్ జిల్లాలో బాలురు వెనుకబడినా, బాలికలు మాత్రం తమ నిలకడను చాటుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,928 మంది బాలికలు పరీక్ష రాయగా, 2,519 మంది ఉత్తీర్ణత సాధించి 64.13% ఫలితాలను సాధించారు. కానీ బాలుర పరిస్థితి ఇక్కడ ఆందోళనకరంగా ఉంది. 3,773 మందిలో కేవలం 1,391 మంది మాత్రమే పాస్ అయ్యి 36.87% వద్ద ఆగిపోయారు.