దారుణం.. ప్రేమించలేదని దారుణ హత్య

దారుణం.. ప్రేమించలేదని దారుణ హత్య

తమిళనాడులోని రామేశ్వరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమను అంగీకరించలేదనే కోపంతో ఓ ఉన్మాది యువతిని కత్తితో పొడిచి చంపాడు. మునిరాజ్ అనే వ్యక్తి గత కొంత కాలంగా ఓ యువతిని వేధిస్తున్నాడు. అయితే, అతడి ప్రేమను ఆమె అంగీకరించలేదు. దీంతో అతడు ఈ దురాఘతానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.