ఖద్దరు బట్ట, కరెన్సీ రాజకీయాలను ఓడించాలి: BSP
BDK: చర్ల మండల కేంద్రంలోని బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో ఇవాళ ఎన్నికల ప్రచార ప్రారంభ సమావేశన్ని నాయకులు నిర్వహించారు. కొండా చరణ్ పాల్గొని మాట్లాడుతూ.. చర్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవికి బీఎస్పీ బలపరిచిన అభ్యర్థి అయిన గుర్రాల దుర్గాభవానికి ఎన్నికల గుర్తు కత్తెర గుర్తు వచ్చిందనీ తెలిపారు. ఖద్దరు బట్ట, కరెన్సీ రాజకీయాలను ఓడించాలని పిలుపునిచ్చారు.