అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో మార్పు

అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో మార్పు

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణ చేసే భక్తులకు టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పులు చేసింది. ప్రస్తుతం రోజుకు 750 చొప్పున ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపై మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో విడుదలవుతాయని పేర్కొంది. భక్తులు మార్పును గమనించి బుక్‌ చేసుకోవాల్సిందిగా టీటీడీ సూచించింది.