భక్తిశ్రద్ధలతో శ్రీ వాసవిమాత జయంతి వేడుకలు
కడప: కమలాపురం పట్టణంలో వెలసిన కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ వాసవి మాత (4641) జయంతి వేడుకను ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉదయం మహిళా మండలి వారు సుప్రభాత సేవ, అమ్మవారికి పాలాభిషేకం నిర్వహించారు. శ్రీ వాసవి మాతను ప్రత్యేక అలంకరణతో పల్లకి సేవ, పురవీధులు గుండా గ్రామోత్సవం నిర్వహించారు.