పెద్దమ్మతల్లికి పంచామృతాలతో అభిషేకం
BDK: పాల్వంచ మండలం జగన్నాధపురంలో కొలువైన శ్రీ పెద్దమ్మతల్లి దేవాలయంలో శుక్రవారం ఆలయ అర్చకులు పంచామృతాభిషేకం పూజలు చేశారు. ముందుగా మూల విరాట్‌కు పంచామృతాలతో అభిషేకం జరిపారు. జన్మ స్థలం వద్ద ఉన్న అమ్మవారికి మేళతాళాలతో పంచామృతాలు పసుపు కుంకుమ గాజులు హారతి సమర్పించారు. ఆలయ ఈవో రజిని కుమారి, పాలకమండలి ఛైర్మన్ బాలినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు.