'సర్పంచ్‌లను గెలిపించే బాధ్యత మీది.. అభివృద్ధి చేసే బాధ్యత నాది'
NLG: ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్లను గెలిపించే బాధ్యత మీది, అభివృద్ధి చేసే బాధ్యత నాది అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం మనుగోడు మండలంలోని సింగారం, ఊకొండి, పులిపలుపుల, కొరటికల్ గ్రామాలలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచార సరళని పరిశీలించి ఆయా గ్రామాల ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు ప్రజలతో కలిసి మాట్లాడారు.