రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

NLG: నేరేడుగొమ్ములోని మోడల్ స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీకి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ శిరీష శుక్రవారం తెలిపారు. నల్గొండ జిల్లా స్థాయి అండర్ 14,17 విభాగంలో జరిగిన ఆటల్లో అండర్ 17 విభాగంలో ఎస్. మిట్టి, జి.మహాలక్ష్మి, కె. రంగ, అండర్ 14 విభాగంలో ఎన్.మాధవి, రాధిక, కే. చందు, ఎన్. శ్రీకాంత్ ఎంపికైనట్లు ఆమె తెలిపారు. అధ్యాపకులు అభినందనలు తెలిపారు.