VIDEO: గ్రామస్తుల ఆందోళన.. స్పందించిన ఎమ్మెల్యే
JGL: సారంగాపూర్ మండలంలోని పెంబట్ల–కొనాపూర్ బ్రిడ్జ్ వద్ద పనులు త్వరగా పూర్తి చేయాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అటుగా వెళ్తున్న సంజయ్ కుమార్ గ్రామస్తులతో మాట్లాడి అప్రోచ్ రోడ్డు పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రాయికల్ మండలం రామాజీపేట్, మహితపూర్ బ్రిడ్జ్ సమస్యల పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.