లైబ్రరీలో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

కృష్ణా: నూజివీడు పట్టణంలోని ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో సోమవారం వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రంధాలయ అధికారి బిహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గ్రంథ పఠనం విశ్వజ్ఞానాన్ని అందిస్తుందన్నారు. ఎన్నో పోటీ పరీక్షలలో గ్రంథ పఠనమే విజేతగా నిలుపుతుందన్నారు. రీడర్ మురళీకృష్ణ విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన అనేక అంశాలను వివరించారు.