ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
PPM: సీతానగరం మండలంలోని జోగంపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించారు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బొమ్మినాయని లక్ష్మణరావు సొంత నిధులతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందన్నారు.