వరంగల్ జిల్లాలో 317 GPలు.. 3 దశల్లో ఎన్నికలు
WGL: జిల్లాలోని మొత్తం 317 పంచాయతీలు ఉండగా 3 దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి దశలో వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తిలోని 91 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 2వ దశలో దుగ్గొండి, నల్లబెల్లి, గీసుకొండ, సంగెంలోని 117 జీపీలకు... 3వ దశలో నర్సంపేట, ఖానాపూర్, చెన్నరావుపేట, నెక్కొండ మండలాల్లోని 109 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.