కార్వేటి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్టీవో ఆకస్మిక తనిఖీలు
CTR: కార్వేటి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆర్టీవో అనుపమ బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం ఎమ్మార్వో, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, గ్రీవెన్స్‌లో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.