కోహ్లీపై ఆసీస్ దిగ్గజ క్రికెటర్ ప్రశంసల వర్షం
విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ స్టీవ్ వా ప్రశంసల వర్షం కురిపించాడు. వన్డే క్రికెట్‌లో కోహ్లీని 'అత్యుత్తమ' ఆటగాడిగా అభివర్ణించాడు. 'అతడు అసాధారణమైన ప్రతిభ కలిగిన క్రికెటర్. ఇలాంటి ఆటగాడు తరానికి ఒక్కడు మాత్రమే ఉంటాడు' అని కొనియాడాడు. అలాగే, కోహ్లీ బ్యాటింగ్ చూడటం తనకు చాలా ఇష్టమని, అవకాశం దొరికితే అతడి ఆటను అభిమానులు కూడా తప్పక చూడాలని కోరాడు.