VIDEO: దున్నపోతుకు వినతిపత్రం అందించిన కార్పొరేటర్
HYD: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఉన్న నేపథ్యంలో సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి వినూత్నంగా నిరసన చేపట్టారు. గత 5 సంవత్సరాలుగా GHMC కౌన్సిల్ సమావేశంలో పలు సమస్యలు విన్నవించినా ఎలాంటి పరిష్కారం జరగలేదు. దీంతో ఈ రోజు కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో మేయర్‌కు అర్థమయ్యే విధంగా దున్నపోతుకు వినతిపత్రం అందించి ర్యాలీగా వెళ్తున్నామన్నారు.