గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ యువకులు
JGL: కోరుట్ల పట్టణంలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్ వెనుక గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిని విచారించగా కృష్ణ జూంబేకర్ అనే వ్యక్తి వద్ద గంజాయి కొన్నట్లు తేలింది. వెంటనే పోలీసులు కృష్ణను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్ల తెలిపారు.