"నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి"
NLG: దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లకు తెర లేపాయని ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ ఆదివారం తెలిపారు. పేద, అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ ఈ సంవత్సరం పూర్తి కాకముందే నూతన అడ్మిషన్ల కోసం వలవేస్తూ ప్రచారాలు చేస్తున్నా కూడా అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం లేదన్నారు.