'కార్తీక మాసం నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేయాలి'

PPM: కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరీ మంగళవారం గుమ్మలక్ష్మీపురం కైలాసనాథ ఆలయ అదనపు భవనం స్లాబ్ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి అంతా ఒక్కటై కృషి చేయడం అభినందనీయమన్నారు. రానున్న కార్తీకమాసానికి ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్వాహకులకు సూచించారు.