'TDP సభ్యత్వం అంటే ఒక రక్షణ కవచం లాంటిది'

ATP: TDP సభ్యత్వం అంటే ఒక కుటుంబానికి రక్షణ కవచం లాంటిదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఇటీవల వివిధ కారణాలతో ప్రమాదవశాత్తు మరణించిన ముగ్గురు కార్యకర్తల కుటుంబాలకు ఎమ్మెల్యే సునీత మంగళవారం ఆర్థిక సాయం అందించారు. మరణించిన కార్యకర్తలు ముగ్గురు గతంలో TDP సభ్యత్వం తీసుకోవడంతో ఒక్కొక్కరికి 5 లక్షలు బీమా మంజూరయిందని పేర్కొన్నారు.