మేడారం జాతరకు రాష్ట్రపతికి ఆహ్వానం
TG: జనవరిలో జరగనున్న సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు రావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మంత్రి సీతక్క ఆహ్వానించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం, ఆదివాసీ సమాజం తరఫున ఆహ్వానం పలుకుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మంత్రి సీతక్క ఈ ఆహ్వానాన్ని అందించారు.