'ప్రజల భద్రతే ప్రభుత్వ ధ్యేయం'
BHPL: ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని MLA గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఇవాళ కాశీంపల్లిలో నూతన సీసీ కెమెరాల ప్రారంభోత్సవంలో MLA ముఖ్య అతిథిగా పాల్గొని 16 ఆధునిక సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం MLA మాట్లాడుతూ.. నేరాలు, అసాంఘిక కార్యకలాపాల అరికట్టడంలో ఈ కెమెరాలు ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.