VIDEO: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. పాఠశాలలో టీవీ ఏర్పాటు
CTR: ఈ రోజు ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా పుంగనూరు ZP బాలికల పాఠశాలలో ఆదివారం సిబ్బంది టీవీని ఏర్పాటు చేశారు. దీంతో టీం ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న మ్యాచ్‌ను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. ఈ మేరకు మంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సిబ్బంది పేర్కొన్నారు. భారత జట్టు విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు.