VIDEO: చాగంటిపాడులో 'రైతన్న మీకోసం’ కార్యక్రమం
కృష్ణా: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు. తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు గ్రామంలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం మంగళవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పెద్దపీట వేశాయన్నారు.