గుడివాడ సమస్యలు తెలుసుకున్న లోకేష్

కృష్ణా: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శనివారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి అంచనా నివేదికలు, ప్రజల సమస్యలు ఆయనకు వివరించారు. ఆర్టీసీ బస్టాండ్, పాఠశాలల మరమ్మత్తులు, రహదారి పనులు, ఐటీఐ అప్‌గ్రేడ్, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు అంశాలపై వినతులు సమర్పించారు. దీనిపై లోకేష్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.