యాచకుల గుర్తింపు సర్వే చేపట్టిన మున్సిపల్ అధికారులు
RR: రాజేంద్రనగర్ సర్కిల్ మున్సిపల్ అధికారులు, గ్రేస్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా బుధవారం యాచకులను గుర్తించడానికి సర్వే నిర్వహించారు. ఆరాంఘర్ చౌరస్తాలో యాచక వృత్తిలో ఉన్న పలువురితో మాట్లాడి, అక్కడ అనారోగ్యంతో నిద్రిస్తున్న వారిని గుర్తించి వివరాలు సేకరించారు. 8 మందిని శివరాంపల్లిలోని షెల్టర్ హోంకు తరలించారు. ఈ కార్యక్రమంలో గ్రేస్ అధ్యక్షురాలు సదాలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.