VIDEO: పుంగనూరులో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం

VIDEO: పుంగనూరులో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం

CTR: పుంగనూరు బజారు వీధిలోని వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమం శుక్రవారం అత్యంత అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఆర్య వైశ్యులు హోమాలు, పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారి విగ్రహానికి క్షీరాభిషేకం, పంచామృత భిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించి ధూప దీప నైవేద్యం సమర్పించారు. ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు.