నిరుద్యోగ భృతి అమలు చేయాలని వినతి

MDK: యూత్ డిక్లరేషన్‌లో భాగంగా నిరుద్యోగ భృతి అమలు చేయాలని డీవైఎఫ్ఎ జిల్లా కార్యదర్శి అనిల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో డీఆర్ఎ పద్మజారాణికి వినతి పత్రం అందజేశారు. నిరుద్యోగ భృతి అమలు చేస్తూ, ప్రతి ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపును విరమించుకోవాలని డిమాండ్ చేశారు.