సర్వైకల్ క్యాన్సర్ నివారణకు HPV టీకా ప్రారంభం
WGL: ప్రపంచంలో సర్వైకల్ క్యాన్సర్ కేసుల్లో 25% భారత్‌లోనే నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దేశంలో ఏటా 15 లక్షల కేసులు నమోదవుతుండగా, 2040 నాటికి 20 లక్షలకు పెరిగే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేటి నుంచి దేశ వ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం కానుండగా, WGL, HNK జిల్లాల్లో మార్చి తొలి వారం నుంచి అమలు చేయనున్నారు.