పన్ను వసూలు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో
కృష్ణా: గుడ్లవల్లేరు మండలం అంగలూరు గ్రామంలో ఇంటి పన్ను వసూలు కార్యక్రమంలో ఎంపీడీవో ఇమ్రాన్ గురువారం పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు పన్నుల ప్రాధాన్యతను వివరించి, ప్రభుత్వ సేవలు మరింత మెరుగ్గా అందేందుకు పన్ను సకాలంలో చెల్లించడం అవసరమని ఎంపీడీవో తెలిపారు. గ్రామ ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.