ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తున్నాం: కోటంరెడ్డి
NLR: ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. పెన్షన్ దగ్గర నుంచి ఉచిత బస్సు దాకా అన్నీ సకాలంలో అమలు చేస్తున్నామన్నారు. రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ 2వ విడత కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.