MLA నవీన్ యాదవ్ తొలి ప్రసంగం
TG: జూబ్లీహిల్స్ నూతన కాంగ్రెస్ MLA నవీన్ యాదవ్ GHMC కౌన్సిల్ సమావేశంలో తన తొలి ప్రసంగాన్ని ఇచ్చారు. సాధారణంగా ఎమ్మెల్యేలు తమ తొలి ప్రసంగాన్ని అసెంబ్లీలో ఇవ్వాలని అనుకుంటారు. కానీ, ఎమ్మెల్యేగా గెలిచిన కేవలం 10 రోజులకే GHMC కౌన్సిల్ సమావేశం జరగడంతో నవీన్ యాదవ్ ఈ మేరకు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, కవి అందెశ్రీ మృతి పట్ల సంతాపం తెలిపారు.