సర్వసభ విశ్వనాథం సేవలు మరవలేనివి: సీపీఐ

KMM: సీపీఐ నాయకుడు కామ్రేడ్ సర్వసభ రామనాథం వర్ధంతి సభను మంగళవారం ఖమ్మంలోని గిరి ప్రసాద్ భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ రామనాథం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సీపీఐ బలోపేతానికి సర్వసభ రామనాథం చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివి అని ఆయన కొనియాడారు. పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను ఆయన తుదిశ్వాస వరకు ఆచరించారని కొనియాడారు.