పేకాట రాయుళ్లు అరెస్ట్..!
VZM: ఎస్.కోట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తూరు శివారు కొండ ప్రాంతంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో సీఐ నారాయణమూర్తి ఆధ్వర్యంలో బుధవారం దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 4,260 నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.