'అన్ని ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లపై QR కోడ్ ముద్రిస్తాం'
HYD: అన్ని ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లపై జియో ట్యాగింగ్‌తో కూడిన క్యూఆర్ కోడ్లను ముద్రించాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్యూఆర్ కోడ్ల ద్వారా అభ్యర్థి వివరాలు, పరీక్ష కేంద్రం స్థానం, హాజరు ధృవీకరణ వంటి సమాచారం వెంటనే తెలుసుకునే వీలుంటుందని ఛైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు.