నరసాపురం టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ డే
W.G: నరసాపురం టీడీపీ కార్యాలయంలో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ప్రజల నుంచి వచ్చిన సమస్యలను టీడీపీ నరసాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు ఆర్జీలు స్వీకరించారు. సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఈ వేదిక ఏర్పాటు చేశామన్నారు.