'పెద్దమ్మ గుడిలో బహిరంగ వేలం'

ఖమ్మం: పాల్వంచ పెద్దమ్మ గుడిలో బుధవారం టెండర్ కం బహిరంగ వేలం ఆలయ ఈవో రజనీ కుమారి, శ్రీ ఉమా సోమలింగేశ్వర స్వామి ఆలయ ఈవో వెంకట్రావు పర్యవేక్షణలో నిర్వహించారు. కొత్త కాంప్లెక్స్‌ను రూ. 38 వేలకు పాటి వీరభద్రం, ఆలయంలో ఫొటోలు తీసే లైసెన్స్ హక్కులను రూ. 95 వేలకు సుస్మిత, తలనీలాలు పోగు చేసుకునే హక్కులను రూ. 9.5 లక్షలకు ఏ.నాగయ్య దక్కించుకున్నారు.