దిబ్బపాలెంలో ఎడ్ల పరుగు పందెం పోటీలు

దిబ్బపాలెంలో ఎడ్ల పరుగు పందెం పోటీలు

AKP: వరసిద్ధి వినాయక మహోత్సవాల్లో భాగంగా ఆదివారం చీడికాడ మండలం దిబ్బపాలెంలో ఎడ్ల పరుగు పందెం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు జెండా ఊపి ప్రారంభించారు. పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ముందుగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.