VIDEO: అనపర్తిలో ఆత్మ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం
E.G: అనపర్తి ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో అనపర్తి డివిజన్ ఆత్మ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని ఆత్మ కమిటీ ఛైర్మన్ వెలుగుబంటి సత్తిబాబు, 24 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నియామక పత్రాలు అందజేసి, ఘనంగా సత్కరించారు.