మినుములు, పెసల కొనుగోలు కేంద్రం ప్రారంభం

మినుములు, పెసల కొనుగోలు కేంద్రం ప్రారంభం

BPT: చెరుకుపల్లి మండలం గూడవల్లిలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ADA లక్ష్మి, జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ కరుణ పాల్గొన్నారు. రబీ 2025-26కు సంబంధించి కనీస మద్దతు ధరకు ఇక్కడ పంటలు కొనుగోలు చేస్తారన్నారు. ప్రభుత్వం క్వింటా మినుములకు రూ.7,800, పెసలకు రూ.8,768 కనీస మద్దతు ధరను రైతులకు చెల్లిస్తున్నట్లు వారు తెలిపారు.