ఈనెల 10 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు

ఈనెల 10 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు

అన్నమయ్య: జిల్లాలో టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంగళవారం DRO మధుసూదన్‌రావు ఆదేశించారు. 4,923 మంది అభ్యర్థుల కోసం మదనపల్లి, అంగళ్లు, రాయచోటి కేంద్రాల్లో 4 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రతిరోజూ 2 సెషన్లలో జరుగనున్నాయి. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.