టైర్ పేలడంతో బొలెరో వాహనం బోల్తా
ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని చీతిరాల కళ్యాణ మండపం సమీపంలో ఆదివారం టైర్ పేలడంతో బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణపాయం లేదని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.