నిఖత్ జరీన్‌కు కవిత అభినందనలు
NZB: మహిళల 51 కేజీల ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న నిఖత్ జరీన్‌కు తెలంగాణ జాగృతి చీఫ్ కవిత శుక్రవారం అభినందనలు తెలిపారు. మీ అచంచలమైన అంకితభావం ప్రతి విజయంలోనూ ప్రతిఫలించింది. ఈ ఘన విజయం భారతదేశానికి ముఖ్యంగా తెలంగాణకు అపారమైన గర్వకారణం అని 'X' వేదికగా ఆమె ట్వీట్ చేశారు.