'జిల్లాలో చిన్న నీటి వనరుల గణన పకడ్బందీగా నిర్వహించాలి'

'జిల్లాలో చిన్న నీటి వనరుల గణన పకడ్బందీగా నిర్వహించాలి'

BDK: జిల్లాలోని చిన్న నీటి వనరుల లెక్కలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వీ. పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో 7వ మైనర్ ఇరిగేషన్ 2వ వాటర్ బాడీస్ సెన్సస్ కార్యక్రమాన్ని జిల్లాలో ఎలా అమలు చేయాలన్న అంశంపై జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.