సబ్ కలెక్టర్‌ను కలిసిన మాజీ ఎంపీ

BDK: భద్రాచలం సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన మృణాల్ శ్రేష్ఠను సీపీఎం సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబురావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివాసీల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. ఏజన్సీ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను సబ్ కలెక్టర్‌కు వివరించారు. సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి ఉన్నారు.