మహిళ మృతదేహం కలకలం

KMR: లింగంపేట్ మండలం రాంపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై దీపక్ కుమార్ బుధవారం తెలిపారు. మండల కేంద్రానికి చెందిన చిన్నక్క (41) 15 రోజుల క్రితం అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశామని, అటవీ ప్రాంతంలో లభ్యమైన మృతదేహం ఆమెదేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.