నేడు పురపాలక సంఘం మొదటి సమావేశం
MDK: మెదక్ పురపాలక సంఘ సాధారణ సర్వసభ్య మొదటి సమావేశం ఈనెల 9న ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలోని మొదటి అంతస్తులో గల మీటింగ్ హాలులో ఏర్పాటు చేసినట్లు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఛైర్ పర్సన్ కానుగు రాధిక అధ్యక్షతన జరిగే సమావేశంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ నరేష్ గౌడ్, కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు సకాలంలో హాజరు కావాలని సూచించారు.