సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

NRPT: కలెక్టర్ సిక్త పట్నాయక్ గురువారం మరికల్ పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. రోగులతో మాట్లాడి, అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీ ప్రాంగణంలో ఉన్న అపరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.