'మహనీయులు చేసిన ప్రాణ త్యాగం ఎప్పటికీ మరువలేనిది'

'మహనీయులు చేసిన ప్రాణ త్యాగం ఎప్పటికీ మరువలేనిది'

SRCL: దేశ స్వాతంత్రం కోసం మహనీయులు చేసిన ప్రాణ త్యాగం ఎప్పటికీ మరువలేనిదని వేములవాడ న్యూ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం విక్కుర్తి లక్ష్మీనారాయణ అన్నారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల 95వ వర్ధంతి, అమరవీరుల దినోత్సవంను పాఠశాలలో నిర్వహించారు. అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వారి త్యాగం స్ఫూర్తిదాయకమన్నారు.